
ఎమ్మెల్యే నివాసంలో ఉగాది వేడుకలు
ఎమ్మెల్యే నివాసంలో ఉగాది వేడుకలు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి మార్చి 19 (ప్రజా కలం) కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ నివాసంలో జరిగిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ దంపతులు పాల్గొన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. రైతులకు సమృద్ధి పంటలు, యువతకు, మహిళలకు మంచి అవకాశాలు, రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో పాటు పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
TAGS Hot News

