
కాంగ్రెస్ టికెట్ ఇస్తా అని మోసం చేసిండ్లు.
కాంగ్రెస్ టికెట్ ఇస్తా అని మోసం చేసిండ్లు..
..రోదించిన మహిళా నాయకురాలు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి, ఫిబ్రవరి 3 (ప్రజాకలం) :కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తానని మోసం చేశారని పట్టణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు హరిత ఆరోపించింది. మంగళవారం జగిత్యాలలోని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసంలో తనకు మెట్పల్లి మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ 24 వార్డు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని కన్నీటి పర్యంతమైంది. ఆమెను జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి.విజయలక్ష్మి ఓదార్చింది. ఆమె మాట్లాడుతూ. ఉదయం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య ఫోన్ చేసి జగిత్యాల కు వచ్చి బీ ఫామ్ తీసుకెళ్లామని చెప్పి, ఇప్పుడు లిస్ట్ లో పేరు లేదనటం ఎంత వరకు సమంజసం అని కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయం పై జువ్వాడి నర్సింగరావును అడుగగా నేనేం చేయలేనని చేతులేత్తేశారంటు రోదించింది. గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశానని పట్టణ మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నప్పటికీ ఇలా చేయడం సరికాదు అంటూ ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరు కావాలని కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తీయించి వేశాడని ఆరోపించింది.తనకు టికెట్ ఇవ్వకపోతే మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య ఫోన్ చేసి జగిత్యాల కు వచ్చి బీ ఫామ్ తీసుకెళ్లామని చెప్పి, ఇప్పుడు లిస్ట్ లో పేరు లేదనటం ఎంత వరకు సమంజసం అని కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయం పై జువ్వాడి నర్సింగరావును అడుగగా నేనేం చేయలేనని చేతులేత్తేశారంటు రోదించింది. గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశానని పట్టణ మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతున్నప్పటికీ ఇలా చేయడం సరికాదు అంటూ ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరు కావాలని కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తీయించి వేశాడని ఆరోపించింది.తనకు టికెట్ ఇవ్వకపోతే మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.

