
ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మహిళల దుర్మరణం
ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మహిళల దుర్మరణం
మల్లాపూర్ ఫిబ్రవరి 03 ( ప్రజా కలం ప్రతినిధి)
మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పసుపు విరవడానికి వెళ్లిన మహిళలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మంగళరాపు లలిత (45), పెద్దిరెడ్డి గంగు (50), సంపంగి సాయమ్మ (35),రోడ్డ వైష్ణవి (15) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఇంకా కొందరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TAGS Hot News

