
ప్రజా సమస్యల కోసమే ప్రజాకలం పత్రిక
ప్రజా సమస్యల కోసమే ప్రజాకలం పత్రిక
కొయ్యురు ఎస్ఐ 2 రజన్ కుమార్
మల్హర్, ఫిబ్రవరి 09 ప్రజాకలం ప్రతినిధి
ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్న దినపత్రిక ప్రజాకలం పత్రిక అని కొయ్యురు ఎస్ఐ 2 వైనాల రజన్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని కొయ్యుర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ 2 రజన్ కుమార్ ప్రజాకలం 2026 నూతన క్యాలెండర్ ను ప్రజాకలం రిపోర్టర్ చొప్పరి రాజు తో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రభుత్వానికి వారదిగ పని చేసే ప్రతికల్లో ప్రజాకలంది ప్రత్యేక స్థానం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ మాచర్ల మధుకర్, సూర్య రిపోర్టర్ ముడితనపెల్లి ప్రభాకర్, విజన్ ఆంధ్ర రిపోర్టర్ రావుల ఆంజనేయులు, ప్రజాజ్యోతి రిపోర్టర్ మడుగురి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
TAGS Hot News

