రంజాన్ కిట్ ల పంపిణీ

రంజాన్ కిట్ ల పంపిణీ

రంజాన్ కిట్ ల పంపిణీ

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి మార్చి 19 (ప్రజా కలం) రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పేద ముస్లింలకు అందిస్తున్న రంజాన్ కిట్ లను గురువారం పంపిణీ చేశారు. కోరుట్ల నియోజకవర్గ మెట్ పల్లిలోని 21 వ వార్డులో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆదేశాలతో జువ్వాడి కృష్ణారావు, మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ఆధ్వర్యంలో రంజాన్ కిట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం తరపున కిట్ లను పంపిణీటెజో పేదల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అని, ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.మైలారపు లింబాద్రి మాట్లాడుతూ ముస్లింలకు కిట్ లను పంచడం చాలా సంతోషం అని అన్నారు. కార్యక్రమంలో మార్కజీ ఇంతేజామి సెంట్రల్ కమిటీ అధ్యక్షులు అఖ్తర్ జానీ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, మున్సిపల్ కౌన్సిలర్లు ఖాజా అజీమ్, మాసుల ప్రవీణ్, బత్తుల నరేశ్, పందిరి రమేశ్, రెబ్బాస్ మహేశ్,గుడికందుల అజయ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహ్మద్ ముఖీం, మహ్మద్ ఖలీద్, నదీమ్, షేక్ మహ్మద్, రయీస్, లతీఫ్, కలిమ్ ఖాన్, మస్జిద్ కమిటీ అధ్యక్షులు మహ్మద్ వాసే, యం.డి. అహ్మద్, మహ్మద్ వాసె, ఎన్ ఆర్ ఐ కార్య వర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )