ప్రశాంత వాతావరణంలో మెదటి విడత పోలింగ్ నిర్వహణ పూర్తి

ప్రశాంత వాతావరణంలో మెదటి విడత పోలింగ్ నిర్వహణ పూర్తి

ప్రశాంత వాతావరణంలో మెదటి విడత పోలింగ్ నిర్వహణ పూర్తి
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
వివిధ గ్రామాల్లో మెదటి విడత పోలింగ్ ప్రక్రియ పరిశీలన
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి డిసెంబర్ 11 (ప్రజా కలం) జగిత్యాల: మొదటి విడత 7 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.గురువారం కోరుట్ల మండలంలోని సంగెం, నాగులపేట్, ఐలాపూర్ గ్రామాలు, మెట్ పల్లి మండలంలోని వెల్లుల్ల, జగ్గసాగర్ గ్రామాలు, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో జిల్లా కలెక్టర్ జిల్లా సాధారణ పరిశీలకులు జి.రమేష్ తో కలిసి పోలింగ్ జరుగుతున్న కేంద్రాలను పరిశీలించారు.ఓటరు జాబితాలో ఓటర్ల క్రమ సంఖ్య సరిచూసుకొని ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలని ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు.పోలింగ్ నిర్వహణను, ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. పోలింగ్ స్టేషన్ ఆవరణలో పోటీలో ఉన్న సర్పంచి, వార్డు సభ్యుల అభ్యర్థుల జాబితాను పరిశీలించారు.గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల సంఖ్య పోలింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేయాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ఆవరణలో ఓటు వేసేందుకు క్యూలో ఉన్న వారందరికీ ఓటు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఒకటి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రం లోపలికి అనుమతించకూడదని ఎన్నికల అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలనలో అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జెడ్పి సిఈవో గౌతమ్ రెడ్డి, డిపివో రఘువరన్, జిల్లా నోడల్ అధికారులు, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీవోలు జీవాకర్ రెడ్డి, శ్రీనివాస్, ఎమ్మార్వో లు, ఎంపిడివోలు మరియు తదితరులు ఉన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )