
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షనీయం
– కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం కూన గోవర్ధన్…
– దశాబ్దాలుగా సుదీర్ఘమైన డిమాండ్లను పరిష్కరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు…
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జులై 12(ప్రజా కలం)
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షనీయమని అని కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ అన్నారు. శనివారం టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ఆదేశాల మేరకు బీసీలకు 42 రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మిఠాయిలు తినిపించుకుని సంబురాలు చేశారు. సామాజిక న్యాయంతోనే అభివృద్ధి సాధ్యమని బలహీన వర్గాల హక్కుల కోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఎన్నికల ప్రణాళికలో కామారెడ్డి డిక్లరేషన్ లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ తెర మీదకు తీసుకోవచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కులగన చేపట్టి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా,కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్రప్రధాన కార్యదర్శి అందె మారుతీ,కల్లెడ గంగాధర్,తోగిటి నాగరాజు,ఇప్పపల్లి గణేశ్,మొగిలి రాజేందర్,బైండ్ల శ్రీకాంత్,ముద్దం ప్రశాంత్,కోరే రాజ్ కుమార్ కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘ నాయకులు ఉన్నారు.

