భువనేశ్వర్‌లో ఐదు రోజుల పర్యటనను ప్రారంభించిన  పీఐబీ హైదరాబాద్‌ మీడియా ప్రతినిధుల బృందం

భువనేశ్వర్‌లో ఐదు రోజుల పర్యటనను ప్రారంభించిన పీఐబీ హైదరాబాద్‌ మీడియా ప్రతినిధుల బృందం

భువనేశ్వర్‌లో ఐదు రోజుల పర్యటనను ప్రారంభించిన
పీఐబీ హైదరాబాద్‌ మీడియా ప్రతినిధుల బృందం
హైదరాబాద్, ఫిబ్రవరి 3 ప్రజాకలం:
హైదరాబాద్‌లోని పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు సభ్యుల మీడియా ప్రతినిధుల బృందం సోమవారం ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఐదు రోజుల పర్యటనను ప్రారంభించింది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలక అభివృద్ధి పథకాలపై మీడియా బృందానికి అవగాహన కల్పించడంతో పాటు ఒడిశా సాంస్కృతిక, వారసత్వ ప్రాముఖ్యతను వెలుగులోకి తీసుకురావడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం.
ఈ బృందానికి పీఐబీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ అఖిల్ కుమార్ మిశ్రా, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు.
మొదటి రోజున భువనేశ్వర్‌లోని పీఐబీ కార్యాలయాన్ని ప్రతినిధుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఏడీజీ శ్రీ అఖిల్ కుమార్ మిశ్రా ఒడిశాలోని మీడియా రంగం.. పీఐబీ, సీబీసీ చేపడుతున్న వివిధ ప్రచార, అవగాహన కార్యక్రమాల గురించి వివరించారు.
రెండో రోజున మీడియా బృందం సీఎస్‌ఐఆర్‌కు చెందిన మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ను (సీఎస్ఐఆప్–ఐఎంఎంటీ) సందర్శించింది. సంస్థ చేపడుతున్న పరిశోధనలు, ప్రయోగశాల సౌకర్యాలు, ఖనిజ- పదార్థ సాంకేతిక రంగాలలో అందిస్తున్న సహకారం గురించి అక్కడి శాస్త్రవేత్తలు మీడియా ప్రతినిధులకు వివరించారు.
ప్రధాన శాస్త్రవేత్త కాళీ సంజయ్ మాట్లాడుతూ.. కీలకమైన ఖనిజాల రంగంలో భారత్‌ను స్వయంసమృద్ధిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన, వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కృషిలో సీఎస్ఐఆర్-ఐఎంఎంటీ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.
ఒడిశా కళలు, సంస్కృతి, హస్తకళల గురించి తెలుసుకోవడానికి మీడియా బృందం ‘కళా భూమి’ మ్యూజియాన్ని సందర్శించింది.
ఫిబ్రవరి 6వ తేదీ వరకు కొనసాగనున్న ఈ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలను ఈ మీడియా ప్రతినిధుల బృందం సందర్శించనుంది.

****

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )