
అక్రమంగా మొరం తీసి, అధికారులను బెదిరించిన వారిపై కేసు నమోదు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 14(ప్రజా కలం) అక్రమంగా మొరం తీసి అధికారులను బెదిరించిన వారిపై కేసు నమోదు చేసినట్లు మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం
తేదీ:13.09.2025 రోజున రాత్రి 07:00 గంటల సమయం లో మెట్ పల్లి శివారులో గల గుండా గుట్ట వద్ద దండుగుల రమేష్ , పి. వెంకటేష్ , దండుగుల నవీన్ మరి కొంత మంది కలిసి అక్రమంగా మొరం తవ్వుతూ దానిని అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రాగా ఫారెస్ట్ డిప్యూటి రేంజ్ ఆఫీసర్ మరియు అతని సిబ్బంది తో సహా అట్టి తవ్వకాలను ఆపమని చెప్పగా అతని మాట వినకుండ వారి ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించి మరియు వారి ప్రభుత్వ వాహనాలను ట్రాక్టర్ల తో కందకం లోకి నెట్టి వేయగా ఫారెస్ట్ డిప్యూటి రేంజ్ ఆఫీసర్ బోల్లోజీ అరుణ్ కుమార్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు
ప్రారంబించనైనదని మెట్ పల్లి ఎస్సై పబ్బ కిరణ్ కుమార్ తెలిపారు.

