పాఠశాల తరగతి గదిలో పాముల కలకలం

పాఠశాల తరగతి గదిలో పాముల కలకలం

– పిల్లలకు తప్పిన ప్రమాదం
మల్లాపూర్, అక్టోబర్ 10 (ప్రజా కలం ప్రతినిధి):
మల్లాపూర్ మండలం హుస్సేన్ నగర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉదయం భయానక పరిస్థితి నెలకొంది. 3వ తరగతి గదిలోకి రెండు పాము పిల్లలు చొరబడడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు పిల్లలకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. మద్యాహ్న భోజన నిర్వాహకులు చాకచక్యంగా స్పందించి పాములను చంపడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది.ఈ ఘటనపై పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులను వివరణ కోరగా, పాఠశాల చుట్టూ పొలాలు ఉండటంతో పాములు పాఠశాల పరిసరాల్లోకి వస్తున్నాయి అని తెలిపారు.ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండటం వల్ల ప్రమాదం తప్పింది అన్నారు.
పాఠశాల పరిసరాలను అపరిశుభ్రంగా ఉంచడం వల్లే ప్రమాదం సంభవించింది అని తక్షణమే అధికారులు చొరవ చూపి శుభ్రత చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )