పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేని

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేని

మెట్ పల్లి డిఎస్పి రాములు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి అక్టోబర్ 24 (ప్రజా కలం) పోలీస్ అమరుల త్యాగాలు మరువలేని మెట్ పల్లి డిఎస్పి రాములు అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాడు కోట్ల పిఎస్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మెట్ పల్లి డిఎస్పి రాములు మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ప్రాణాలు త్యాగం చేసిన పోలీసులు స్మరించుకోవడం మన కర్తవ్యం అని అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కోరుట్ల సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మెట్ పల్లి డిఎస్పి రాములు ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక యువత, వ్యాపారస్తులు స్వచ్చందంగా రక్తదానం చేశారు. రక్తదాన చేసిన వారికి డిఎస్పి గారి చేతుల మీదుగా పండ్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రక్త దానం చేసేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చిన అందరికీ అభినందనలు తెలియజేశారు.శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణ త్యాగాలు చేసిన పోలీస్ అమరవీరులను స్మరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా తాజాగా శరీరంలోకి కొత్త రక్తం ఉత్పత్తి అవుతూ ఆరోగ్యంగా ఉంటామని సూచించారు. సృష్టించలేని ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడడటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ రక్తదాన శిబిరాలలో సుమారు 100 యూనిట్ల రక్తాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఎస్.ఐ లు చిరంజీవి ,శ్రీధర్ రెడ్డి , జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ మంచాల కృష్ణ, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )