మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

-మెట్ పల్లి సీఐ అనిల్
మెట్ పల్లి బస్టాండ్ లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు.


మెట్ పల్లి:(కోరుట్ల) అక్టోబర్ 24 ప్రజా కలం ప్రతినిధి
మత్తు పదార్థాల వ్యసనానికి దూరంగా ఉండాలని మెట్ పల్లి సీఐ అనిల్ సూచించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం మెట్ పల్లి బస్టాండ్ లో మాదకద్రవ్యాలను గుర్తించే ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్‌తో పోలీస్ సిబ్బంది ఆకస్మికంగా బస్ స్టాండ్ లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానిత బ్యాగుల వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. అనంతరం సీఐ అనిల్ మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాల కోసం ఈ శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టడం జరిగిందని వెల్లడించారు. శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ గంజాయి, మత్తు పదార్థాలను గుర్తిస్తాయని తెలిపారు. గంజాయి మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించడం వంటివి నేరమని, పోలీసు తనిఖీల్లో పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదవుతాయని అన్నారు. ఈ కారణంగా ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ఆశలు నిర్వీర్యం అవుతాయన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కాగా ఈ తనిఖీలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ తనిఖీల్లో మెట్ పల్లి ఎస్సై పబ్బా కిరణ్, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.
 

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )