మొదటి ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి

మొదటి ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి

మొదటి ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఎన్నికలు నిర్వహణకు 843 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు.


మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి డిసెంబర్ 10 (ప్రజా కలం) జిల్లాలో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ఈరోజు బీమారం, కోరుట్ల,మెట్ పల్లి లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లను అదనపు ఎస్పీ తో కలిసి సందర్శించారు. ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఆయా ప్రాంతాలకు ఎన్నికల సామగ్రి ని పటిష్ట పోలీస్ బందోబస్త్ మద్య తరలించడం జరిగిందని ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూటు మొబైల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గతంలో జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని అదే స్ఫూర్తితో సర్పంచ్ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహిస్తామని అన్నారు. మొదటి విడతకి సంబంధించి 1172 పోలింగ్ కేంద్రాల లో పోలింగ్ జరుగుతుంది అని దీనికి సంబంధించి (843) మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు అని అన్నారు. పటిష్ట ఎస్కార్ట్ తో పోలింగ్ సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుంది (46) రూట్స్ లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ , స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, ఎస్.ఐ లతో పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికలలో పోలీసుల విధి విధానాలపై పోలీస్ అదికారులకు,సిబ్బందికి దిశానిర్దేశం చేశామని, పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రలోభాలకు తావు లేకుండా ప్రతి ఓటరు తమ ఓటు ను స్వేచ్ఛగా వినియోగించుకునే ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఓటర్లు ఎవ్వరూ కూడా సెల్ ఫోన్ లు, మందుగుండు సామాగ్రి, ఇంక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, పోలింగ్ బూతు లోనికి తీసుకువెళ్లారాదని, సెల్ఫీలు దిగడం నిషేదం అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికల సంఘంచే జారీ చేయబడిన నియమాలను పక్కగా అమలు చేస్తామన్నారు. ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి , డిఎస్పీలు వెంకటరమణ, రాములు, సి.ఐలు ,ఆర్.ఐ లు, ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )