ఎన్నికలు పారదర్శంగా నిర్వహించాలి

ఎన్నికలు పారదర్శంగా నిర్వహించాలి

ఎన్నికలు పారదర్శంగా నిర్వహించాలి
– జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి డిసెంబర్ 10 (ప్రజా కలం) మొదటి విడత 11వ తేదీన జరిగే 7 మండలాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.బుధవారం కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు.పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సిబ్బంది బాధ్యతల పంపిణీ, లాజిస్టిక్స్ ఎన్నికల మెటీరియల్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ పరిశీలనలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) బి. రాజ గౌడ్, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీవోలు జివాకర్ రెడ్డి, శ్రీనివాస్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిణి, ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )