
మెడికవర్ హాస్పిటల్ లో విజయవంతమైన స్టమక్ క్యాన్సర్ శస్త్రచికిత్స
మెడికవర్ హాస్పిటల్ లో విజయవంతమైన స్టమక్ క్యాన్సర్ శస్త్రచికిత్స
హనుమకొండ జనవరి 12 ప్రజా కలం ప్రతినిధి
వరంగల్ మెడికవర్ హాస్పిటల్లో మరోసారి వైద్యులు తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.ప్రాణాంతకమైన కడుపు క్యాన్సర్‌తో బాధపడుతున్న 55 ఏళ్ల వ్యక్తికి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా అతడికి కొత్త జీవితం అందించారు.కొన్ని వారాలుగా కడుపులో నొప్పి,జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగి హాస్పిటల్‌కు చేరుకున్నాడు.సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా.సునీల్ నాగుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఎండోస్కోపీ,సీటీ స్కాన్ పరీక్షల్లో ప్రారంభ దశలోనే స్టమక్ క్యాన్సర్ ఉన్నట్టు గుర్తించారు.సమయానికి వ్యాధిని నిర్ధారించడంతో,శస్త్రచికిత్స ద్వారానే పూర్తిస్థాయి చికిత్స సాధ్యమని వైద్యులు తెలిపారు.ఆంకాలజీ నిపుణుల సూచనల మేరకు డా.సునీల్ నాగుల నేతృత్వంలో టోటల్ గ్యాస్ట్రెక్టమీ విత్ D2 లింఫ్ నోడ్ డిసెక్షన్ శస్త్రచికిత్సను అత్యంత జాగ్రత్తగా నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం రోగి ఆశించినదానికంటే వేగంగా కోలుకుని, ఆరోగ్యంగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారనీ వరంగల్ ట్రైసిటీ ప్రాంతంలో ఇలాంటి అధునాతన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలు పరిమిత కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని మెడికవర్ హాస్పిటల్లో స్టమక్,లివర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్లకు ఆధునిక సౌకర్యాలతో చికిత్సలు అందుతున్నాయని,ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకూ క్యాన్సర్ వైద్యం అందించబడుతోందని హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించించారు.ఈ సందర్భంగా డా. సునీల్ నాగుల మాట్లాడుతూ, “కడుపులో తరచూ నొప్పి,ఆకలి లేకపోవడం,తెలియని బరువు తగ్గడం, రక్తహీనత,తిన్న వెంటనే నిండిపోయిన భావన వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు” అని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

