
ప్రజా సేవకై వస్తున్నా…మీ బిడ్డగా ఆశీర్వదించండి
– వేములవాడ 24వ వార్డులో రేగుల మల్లికార్జున్ పోటీ
ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో సయ్యద్ అలీ, వేములవాడ జనవరి 21 (ప్రజా కల ప్రతినిధి) : రానున్న వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని 24వ వార్డు కౌన్సిలర్‌గా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రేగుల మల్లికార్జున్ పోటీ చేస్తున్నారు.ఈ సందర్భంగా బుధవారం వార్డు ప్రజలను కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ప్రజల అభిప్రాయం,వారి సూచలనల మేరకు 24వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మల్లికార్జున్ పార్టీలకతీతంగా వివాదరహితుడుగా మంచి పేరు సంపాదించుకున్నారు.వేములవాడ మున్సిపల్ చైర్మన్ పదవి ఈసారి బీసీ జనరల్ రిజర్వేషన్ కావడంతో ఆయన ఇక్కడి నుండి గెలిస్తే పార్టీ నుండి చైర్మన్ గా అవకాశం రావచ్చుననే ప్రచారం జోరుగా సాగుతోంది.దీంతో వార్డు ప్రజలు సైతం మల్లికార్జున్ నాయకత్వాన్ని బలపరుస్తూ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ దాదాపు ఖరారు కావడంతో తనదైన శైలిలో ప్రచారం మొదలుపెట్టారు.గెలుపే లక్ష్యంగా “ప్రజా సేవకై వస్తున్నా… మీ బిడ్డగా ఆశీర్వదించండి” అనే నినాదంతో ఆయన ప్రజల ముందుకు వెళ్లుతున్నారు.మంచితనానికి మారుపేరుగా గుర్తింపు పొందిన రేగుల మల్లికార్జున్,ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడూ తోడుగా నిలిచే నాయకుడిగా వార్డులో విశేష ఆదరణ పొందుతున్నారు.నమ్మిన సిద్ధాంతం కోసం అంకితభావంతో పనిచేసే వ్యక్తిత్వం ఆయన ప్రత్యేకతగా స్థానికులు పేర్కొంటున్నారు.సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ,పేదలు-మధ్యతరగతి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార దిశగా కృషి చేసిన అపారమైన అనుభవం ఆయనకు ఉంది.ముఖ్యంగా 24వ వార్డు అభివృద్ధి, ప్రజల సంక్షేమం,తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల మెరుగుదలే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేస్తున్నారు.ఇలాంటి మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే వార్డు సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు మెరుగ్గా అందుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో మమేకమై,వారి సమస్యలను తన సమస్యలుగా భావించే నాయకుడిగా రేగుల మల్లికార్జున్ పేరు వార్డులో విస్తృతంగా చర్చకు వస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ద్వారా వేములవాడ పట్టణ అభివృద్ధి,ప్రజల సంక్షేమం కోసం నిధుల మంజూరుకు తమ పార్టీ తరుపున ఎల్లవేళలా కృషి చేస్తామని ఆయన ప్రజలకు తెలియజేస్తున్నారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆదరించి,ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి 24వ వార్డు కౌన్సిలర్ గా భారీ మెజార్టీ తో గెలిపించాలని మల్లికార్జున్ కోరుతున్నారు.

