
శ్రీనివాస్ కు తెలంగాణ రాష్ట్ర పోలీస్ సేవా పతకం
హైదరాబాద్ ప్రతినిధి, జనవరి 25 (ప్రజాకలం) :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక పోలీస్ సేవా పతకాల్లో ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ (బీఓఐ) విభాగంలో పనిచేస్తున్న అధికారి డి. శ్రీనివాస్ ఎంపికయ్యారు. తెలంగాణ పోలీస్ విభాగంలో ఆయన అందించిన 27 ఏళ్ల సుదీరమైన విశిష్టమైన సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ప్రభుత్వ ఉత్తర్వులు – (జీఓఎంఎస్) నెంబర్ 144/హెూమ్ డిపార్ట్మెంట్ దీని క్రింద రూ. 20 వేల రివార్డ్ అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ (బీఓఐ) విభాగంలో జూనియర్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ (గ్రేడ్-1)గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ వారి కెరీర్ ఎంతో సూర్తిదాయకం. గత (27) ఏళ్ల సర్వీసులో ఆయన తన వృత్తి పట్ల అంకితభావంతో పనిచేశారు. గతంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు, గతంలో పని చేసిన కరీంనగర్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ చేతుల మీదుగా ‘ఉత్తమ ఉద్యోగి’ అవార్డులను అందుకున్నారు. తన మొత్తం సర్వీసులో వివిధ ఉన్నతాధికారుల నుండి ఇప్పటివరకు 60కి పైగా రివార్డులను అందుకోవడం ఆయన పనితీరుకు నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డు పట్ల ప్రస్తుతం ఆయన పనిచేస్తున్న (బీఓఐ) కార్యాలయ అధికారులతో పాటు, గతంలో ఆయన పనిచేసిన వివిధ అధికారులు, సహచరులు తోటి ఆఫీసర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ కి శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన అంకితభావం తోటి ఉద్యోగులకు మార్గదర్శకమని కొనియాడారు.


