
మొదలైన నామినేషన్ ప్రక్రియ…
మొదలైన నామినేషన్ ప్రక్రియ…
నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి, జనవరి 28 (ప్రజాకలం) :తెలంగాణ రాష్ట్ర రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన షెడ్యూల్ లో భాగంగా బుధవారం మెట్ పల్లి మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించారు.నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం 15 మంది అభ్యర్థులు 17 సెట్ ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మెట్ పల్లి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించి తగు సలహాలు సూచనలు అందించారు. వారి వెంట ఆర్డీవో శ్రీనివాస్,తహశీల్దార్ నీత పాల్గొన్నారు.మున్సిపల్ ప్రక్కన ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. హెల్ఫ్ డెస్క్ లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులు నామినేషన్ల పత్రాలు అందిస్తామని, వారికి ఏమైనా సందేహాలు, సలహాలు, సూచనలు ఉన్నట్లయితే వారికి హెల్ప్ డెస్క్ ద్వారా వివరాలు అందిస్తామని మున్సిపల్ కమీషనర్ మోహన్ వెల్లడించారు. మొదటి రోజు 15 మంది అభ్యర్థులు 17 నామినేషన్లు దాఖలు చేసారని ఎన్నికల అధికారులు తెలిపారు. బీజేపీ నుండి 5 నలుగురు అభ్యర్థులు), కాంగ్రెస్ 5, బి ఆర్ ఎస్ నుండి 5 నలుగురు అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులచే రెండు నామినేషన్లు నమోదు అయ్యాయన్నారు.

