
కోడ్ కూసినా.. మూసివేయారా..?
కోడ్ కూసినా.. మూసివేయారా..?
…నిద్ర లేవని అధికారులు..
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జనవరి 30 (ప్రజా కలం) ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చి మూడు రోజులు గడుస్తున్నా.. ఇంకా పట్టణంలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. ఎక్కడికక్కడ రాజకీయ పార్టీలు, నాయకులకు సంబంధించిన ఆనవాళ్లు దర్శనం ఇస్తూన్నాయి.గత మూడు రోజుల క్రితం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన,రాష్ట్ర ఎన్నికల సంఘం,జిల్లా కలెక్టర్ రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయాలని, పార్టీల కు సంబంధించిన రాతలు తొలగించాలని,శిల పలకలు కనబడకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారి చేసిన ఇక్కడి అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. మెట్‌పల్లి పట్టణంలో పలు వార్డులలో ఏర్పాటు చేసిన గత ప్రభుత్వ అభివృద్ధి పనుల శిల పలకలు మాత్రం మూతపడకుండా దర్శనం ఇస్తన్నాయి. ఈ చిత్రాలను చూసిన పలువురు మేధావులు. అధికారుల నిద్రమత్తు ఇంకా వదలలేరు కావచ్చు అని గుసగుసలాడుతున్నారు.

