
కామారెడ్డి మున్సిపల్ లో ఏసీబీ సోదాలు….
కామారెడ్డి మున్సిపల్ లో ఏసీబీ సోదాలు….
ఫోటో : కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం.
ఎల్లారెడ్డి (కామారెడ్డి) మార్చి 16 ప్రజా కలం ప్రతినిధి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలోని వివిధ విభాగాల్లో వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆరా తీస్తున్నారు. కమిషనర్ ఛాంబర్ లో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ తనిఖీలతో ఆయా శాఖల అధికారుల్లో గుబులు మొదలైంది.
– 2025-26లో అనధికార నిర్మాణాలపై 47 ఫిర్యాదులు వచ్చినా, నోటీసులు ఇచ్చిన తర్వాత ఎటువంటి చర్య తీసుకోలేదు.
– 400కి పైగా వాణిజ్య షాపుల ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్స్ పెండింగ్లో ఉండి, సుమారు ₹1 కోటి బకాయిలు ఏర్పడ్డాయి.
– ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్లలో తేడాలు గుర్తించారు, దీనివల్ల ప్రభుత్వానికి నష్టం.
– మున్సిపల్ అధికారుల ఫ్యుయెల్ ఛార్జీల కోసం నెలకు ₹12,40,000 కేటాయించినా, సరైన రికార్డులు లేవు.
– కొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గైర్హాజరుగా మార్క్ చేసినా, పూర్తి నెల జీతం చెల్లించారు.
– డిసెంబర్ 2025 నుంచి 169 బిల్డింగ్ పర్మిషన్ దరఖాస్తుల్లో 18 ఆలస్యంగా ప్రాసెస్ అయ్యాయి.
తాము కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఏసీబీ సోదాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించి చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ అయితే టోల్ ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేయాలని వారు సూచించారు.

