
దేశంలోనే అగ్రగామి సంస్థ కోటా రాజస్థాన్ మోషన్ కాలేజీలో ఉచిత విద్య
దేశంలోనే అగ్రగామి సంస్థ కోటా రాజస్థాన్ మోషన్ కాలేజీలో ఉచిత విద్య
-మెరిట్ సాధించిన పేద విద్యార్థులను ప్రోత్సహించడమే మోషన్ కాలేజీ లక్ష్యం.
-మోషన్ కాలేజ్ చైర్మన్, వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్.
హన్మకొండ, :
పదవ తరగతి పరీక్షల్లో మెరిట్ సాధించిన పేద విద్యార్థులకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా కోటా రాజస్థాన్‌కు చెందిన మోషన్ ఐఐటీ–జేఈఈ–నీట్ జూనియర్ కళాశాల ప్రత్యేక అవకాశాన్ని ప్రకటించింది. కాలేజీ చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఐఐటీ, మెడికల్ ప్రవేశాలకు శిక్షణ అందించే అగ్రగామి సంస్థగా పేరుగాంచిన మోషన్ కాలేజీ, హన్మకొండ నయీమ్‌నగర్‌లో తన శాఖను నిర్వహిస్తోంది. నిష్ణాతులైన అధ్యాపక బృందంతో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధన అందిస్తున్నట్లు తెలిపారు.
మెరిట్‌కు అనుగుణంగా ఫీజు రాయితీలు:
- 570 మార్కులు పైగా సాధించిన వారికి — 100% ట్యూషన్ ఫీజు మాఫీ
- 560 మార్కులు పైగా — 75% రాయితీ
- 550 మార్కులు పైగా — 50% రాయితీ
- 500 మార్కులు పైగా — 25% రాయితీ
పదవ తరగతి ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని వేణుగోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు.
మరిన్ని వివరాల కోసం హన్మకొండ నయీమ్‌నగర్‌లోని సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురు లైన్లో ఉన్న మోషన్ కాలేజీని లేదా సెల్ నంబర్లు 9703000850, 9703000851లను సంప్రదించవచ్చు.

