మహిళల రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ కుట్రలు

మహిళల రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ కుట్రలు

*మహిళల రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ కుట్రలు*

 

-ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య,

 

పెద్దపల్లి,మే 03:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి)

పార్లమెంటులో మహిళా బిల్లును అడ్డుకొని,సామాన్య

మహిళలు రాజకీయంగా ఎదగకుండా అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీకి మహిళా లోకం తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య,రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కాంటెస్ట్ అభ్యర్థి,మాజీ జడ్పిటిసి కందుల సంధ్యారాణి హెచ్చరించారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళా శక్తికి ప్రాధాన్యతనిస్తూ 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా,డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా రాజకీయంగా 50 శాతం అవకాశాలు కల్పించాలని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఓటు వేయకుండా అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీలో కేవలం ఇందిరా గాంధీ,సోనియా గాంధీ,ప్రియాంక గాంధీ వంటి వారసత్వ మహిళా నేతలు మాత్రమే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారని,బడుగు బలహీన వర్గాల సామాన్య మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టడం వారికి ఇష్టం లేదని ధ్వజమెత్తారు.డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 60 వరకు పెరగడమే కాకుండా,ప్రస్తుతం ఉన్న 17 పార్లమెంట్ స్థానాలు 26కు పెరిగి మరింత మంది ఎస్సీ,ఎస్టీ మహిళలకు ప్రజాప్రతినిధులుగా అవకాశం లభిస్తుందని వారు వివరించారు.ఇంతటి గొప్ప అవకాశాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో మహిళలు భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు.విద్యావంతులైన మహిళలు చట్టసభలకు వెళ్ళినప్పుడే మెరుగైన సమాజం తయారవుతుందని,అందుకే బీజేపీ ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మహేష్,జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి,మాజీ ఎంపీపీ రేణుక,మహిళా నాయకురాలు వడ్డేపల్లి భారతి,పద్మ,నిర్మల,అపర్ణ,బెజ్జంకి దిలీప్,కందుల పోచం తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )