విశ్వక్ సేన్ ” కోసం ఎదురుచూస్తున్న ఒక మలయాళి కథా రచయిత….

విశ్వక్ సేన్ ” కోసం ఎదురుచూస్తున్న ఒక మలయాళి కథా రచయిత….

విశ్వక్ సేన్ ” కోసం ఎదురుచూస్తున్న ఒక మలయాళి కథా రచయిత….

మలయాళంలో ఈ మధ్యకాలంలో విడుదలైన సినిమా ” ఓసెప్పింట్ ఓశియతు” . ఈ సినిమా కథా రచయిత
“ఫసల్ హసన్”. ఇది ఆయనకి మొదటి సినిమా. కుటుంబ కథా సారాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కి ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఫసల్ హసన్ కి మరో సినిమా కథకి అవకాశం దక్కింది. రోమ్ కమ్ (rom-com) అనే టైటిల్ ను ఆ సినిమా కథకి ఖరారు చేసినట్లుగా , త్వరలోనే ఆ కొత్త కథతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తున్నట్లుగా తెలియజేశారు. అంతే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా రాబోతున్నట్లుగా సంభాషణ జరుగుతుంది.మలయాళం సినిమాలే కాకుండా తెలుగు సినిమాలు రాయడానికి తనకీ ఆసక్తి ఉన్నట్టుగా తెలిపారు. దాంతో తెలుగు సినిమాలు చేయడానికి కొన్ని కథలు కూడా సిద్ధం చేసుకొని ఉన్నారు అని తెలియజేశారు . జోనర్ ఏది అయినా సరే , అన్నీ జోనర్లల్లో సినిమా కథాసారంశాలు సిద్ధంగా ఉన్నాయని కూడా తెలిపారు. ప్రస్తుతం తెలుగు హీరోలలో ఎంతోమంది కథానాయకులు ఉన్నప్పటికీ , యువనాయకుడు ” విశ్వక్ సేన్ ” గారి కోసం మాత్రం స్పెషల్ గా కథని సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. ఒకవేళ హీరో “విశ్వక్ సేన్” గారు ఆయనకోసం సిద్ధం చేసిన ఆ కథని ఆయన గనుక చేయకపోతే ఆ సినిమా కథని వేరే ఏ హీరోతోనూ చేయనని ససేమిరా తెలిపారు.
అయితే ” విశ్వక్ సేన్” గారికి తను రాసుకున్న ఆ కథని వివరించి, సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. *”ఏదో ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి , కథని వివరించి, తప్పకుండా సినిమా చేస్తాను”* అని నమ్మకంతో కథారచయిత “ఫసల్ హసన్” ఉన్నట్టు తెలియజేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )