చిన్న చిన్న వ్యాపారాలు పై మున్సిపల్ అధికారుల ప్రతాపం ఏంటి?

చిన్న చిన్న వ్యాపారాలు పై మున్సిపల్ అధికారుల ప్రతాపం ఏంటి?

చిన్న చిన్న వ్యాపారాలు పై మున్సిపల్ అధికారుల ప్రతాపం ఏంటి?
మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన
మైలార్ దేవ పల్లి డివిజన్ అధ్యక్షులు ఎస్ వెంకటేష్
రాజేంద్రనగర్, జూన్ 19, (ప్రజా కలం)
చిన్న చిన్న వ్యాపారాలు పై మున్సిపల్ అధికారుల ప్రతాపం ఏంటి అని మున్సిపల్ అధికారులను మైలార్ దేవ పల్లి డివిజన్ అధ్యక్షులు ఎస్ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలనా లో భాగంగా చదువుకున్న విద్యార్థులు మరియు నిరుపేదలు అప్పు చేసి ఏ పని లేక చిన్న చిత్క చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలన్ని పోషించుకుంటున్న తరుణంలో మున్సిపల్ అధికారులు తోడేళ్ల లాగా జెసిబిలు పోలీసుల బందోబస్తు తో విద్యార్థుల వ్యాపారాల సముదాయలపై కూల్చి వెయడం తో స్థానికులు సమాచారం ఇవ్వడం తో మైలార్ దేవ పల్లి డివిజన్ అధ్యక్షులు ఎస్ వెంకటేష్ మాజీ కౌన్సిలర్ బిఆర్ఎస్ నాయకులతో కలిసి అక్కడికి వెళ్లి అధికారులను ప్రశ్నించడం జరిగింది. మహిపిల్ హోటల్ ఇండియన్ బేకరీ చోటే బాయ్ బోడే బాయ్ ఇలాంటి స్థానిక ప్రజా ప్రతినిధుల కమర్షియల్ బిల్డింగ్లు కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా నిరుపేదల వ్యాపారాలపై మున్సిపల్ అధికారుల దౌర్జన్యం ఏమిటని బిఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. మహిపిల్ హోటల్, ఇండియన్ బేకరీ దుర్గా నగర్ చౌరస్తా గణేష్ నగర్ చౌరస్తా యూటర్న్ వద్ద స్థానిక ప్రజా ప్రతినిధుల ఇండ్ల ముందు ప్రతిరోజు రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు
అపిన్నప్పుడు అధికారులకు గాని ట్రాఫిక్ సిబ్బందికి కనిపించడం లేదా ఆయన ప్రశ్నించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )