జెన్కో పవర్ స్టేషన్‌లో ఉద్యోగి ఆత్మహత్య

జెన్కో పవర్ స్టేషన్‌లో ఉద్యోగి ఆత్మహత్య

*జెన్కో పవర్ స్టేషన్‌లో ఉద్యోగి ఆత్మహత్య*
*కుటుంబ కలహాలు,ఆర్థిక ఇబ్బందులే కారణం..!
పెద్దపల్లి,జూలై 30:(ప్రజాకలం జిల్లా ప్రతినిధి)
పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం,తుర్కల మద్దికుంటలోని జెన్కో పవర్ స్టేషన్‌లో పనిచేస్తున్న రాజు (48) అనే ఉద్యోగి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదం నింపింది.బుధవారం ఉదయం పవర్ స్టేషన్ క్యాంపస్‌లోని తన గదిలో రాజు విగతజీవిగా కనిపించడంతో తోటి ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు రాజు కుటుంబ సభ్యులను విచారించగా,గత కొంతకాలంగా కుటుంబ కలహాలు,తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో రాజు సతమతమవుతున్నాడని తెలిపారు.
ఈ కారణాల వల్లే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.రాజు ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై లోతైన విచారణ జరుపుతున్నారు.పవర్ స్టేషన్ సిబ్బంది, ఇతర ఉద్యోగులను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )