పోషకాహార పానీయ విభాగంలో కొత్త అడుగు.. Nutri+తో రస్నా వృద్ధి లక్ష్యం

పోషకాహార పానీయ విభాగంలో కొత్త అడుగు.. Nutri+తో రస్నా వృద్ధి లక్ష్యం

పోషకాహార పానీయ విభాగంలో కొత్త అడుగు.. Nutri+తో రస్నా వృద్ధి లక్ష్యం

న్యూ ఢిల్లీ, 13మార్చి, 2026: Rasna వేసవి సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని Rasna Nutri+ అనే కొత్త పోషకాహార పానీయ కాన్సన్‌ట్రేట్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

సంప్రదాయ రుచితో పాటు విటమిన్లు, ఖనిజాలు కలిగిన ఈ ఉత్పత్తి ద్వారా కంపెనీ 15 నుంచి 20 శాతం వార్షిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుతం కాన్సన్‌ట్రేట్ మార్కెట్లో 70 శాతానికి పైగా వాటా కలిగిన రస్నా, సెమీ అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తోంది.

ఈ ఉత్పత్తి 32 గ్లాస్ ప్యాక్స్ మరియు Insta Nutri+ 500 గ్రాముల ప్యాక్స్‌లో అందుబాటులో ఉంటుంది. వీటిలో పిల్లలకు ఆకర్షణీయంగా ఉండే ‘Prankies’ అనే టాయ్స్‌ను కూడా అందిస్తున్నారు.

ఈ సమ్మర్ క్యాంపెయిన్‌కు నటి Rakul Preet Singh బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తుండగా, కంపెనీ చైర్మన్ Piruz Khambatta కుమారుడు అరీజ్ ఖంబాట్టా ప్రకటనలో కనిపిస్తున్నారు.

కంపెనీ చైర్మన్ పిరూజ్ ఖంబాట్టా మాట్లాడుతూ, భారతీయ పండ్లతో తయారీ చేసి 60కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.

రస్నా 2026 సమ్మర్ ప్రచారంలో భాగంగా Indian Premier League మ్యాచ్‌ల సమయంలో, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు టెలివిజన్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేపడుతోంది.

రస్నా గురించి
Rasna Pvt Ltd భారతదేశంలో 12 తయారీ యూనిట్లు, 26 డిపోలు, 200 సూపర్ స్టాకిస్టులు, 5,000 స్టాకిస్టులు, 900 సేల్స్ సిబ్బందితో 18 లక్షల రిటైల్ అవుట్‌లెట్లను కవర్ చేస్తోంది. ISO, HACCP, HALAL, FSSAI సర్టిఫికేషన్లు కలిగిన ఈ సంస్థ ప్రస్తుతం 60కిపైగా దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )