యాదాద్రి మహిళలకు అబార్షన్…

యాదాద్రి మహిళలకు అబార్షన్…

పోలీసుల అదుపులో వైద్యుడు శివ
భువనగిరి జూలై 07 ప్రజాకలం: భువనగిరిలోని గాయత్రి ఆసుపత్రిపై ఎస్ఓటీ పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు.ఈ దాడుల సమయంలో ఆసుపత్రిలో ఇద్దరు మహిళలకు అక్రమంగా అబార్షన్ చేస్తున్న ఘటనను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా డాక్టర్ శివకుమార్ ను పోలీసులు గుర్తించి..అతనిని భువనగిరి టౌన్ పోలీసులకు హ్యాండోవర్ చేశారు.డాక్టర్ శివకుమార్ అరెస్ట్ అవ్వడం ఇది మొదటి సారి కాదు.2022లో ఆలేరులో ఓ బాలికకు అక్రమ అబార్షన్ నిర్వహించిన సమయంలో కూడా ఇతను రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు.అప్పట్లో అతను నిర్వహిస్తున్న ‘స్వాతి హాస్పిటల్’ను వైద్యాధికారులు సీజ్ చేశారు.అనంతరం డాక్టర్ శివకుమార్ తన అసలు పేరు, హాస్పిటల్ పేరు మార్చి, గాయత్రి ఆసుపత్రిగా మళ్లీ ప్రారంభించాడు.ప్రస్తుతం ఆయన ప్రతి అబార్షన్ కు రూ.50,000 వసూలు చేస్తూ వైద్యం అందిస్తున్నట్టు సమాచారం.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )