
ఏసీబీ సోదాల సమాచారం లీక్.
ఏసీబీ సోదాల సమాచారం లీక్.
ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు.
ఉప్పల్ జూలై 17(ప్రజాకలం న్యూస్)
హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌లో భారీగా నిధుల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు హెచ్‌సీఏ సెక్రటరీ దేవరాజ్, ట్రెజరర్ జగన్నాథ్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కుమార్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రెటరీ రాజేందర్ యాదవ్, రాజేందర్ యాదవ్ భార్య కవిత మొత్తం ఆరుగురిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ కేసులో ఏ2గా ఉన్న దేవరాజ్‌ను తప్ప మిగిలిన అధికారులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దేవరాజ్ మాత్రం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు.దేవరాజ్ పరార్ కావడానికి ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డే కారణమని అధికారులు గుర్తించారు.దేవరాజ్ అరెస్ట్‌కు సీఐడీ రంగం సిద్ధం చేయగా.. అరెస్ట్ సమాచారాన్ని ముందుగానే దేవరాజ్‌కు చేరవేశాడు ఎలక్షన్ రెడ్డి. దీంతో దేవరాజ్ సీఐడీకి చిక్కలేదు.సీఐడీ సమాచారాన్ని ముందుగా లీక్ చేసినందుకు సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు.తనకు సంబంధం లేని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వ్యవహారంలో తలదూర్చడంతో ఎలక్షన్ రెడ్డిపై వేటు వేశారు అధికారులు.

