
రైలు కిందపడి యువతి ఆత్మహత్య
రైలు కిందపడి యువతి ఆత్మహత్య
* యువతి మృతికి కారణమైన వారిని శిక్షించాలని,బంధువుల ఆందోళన
*వలిగొండ జనవరి 9 ప్రజాకలం*:వలిగొండ మండల పరిధిలోని గొల్నెపల్లి గ్రామంలో అమ్మమ్మ వద్ద ఉంటు చదువుకుంటున్న,యువతి బీబీనగర్ మండల పరిధిలో రైలు కిందపడి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసల్యంగ వెలుగులోకి వచ్చింది, రైల్వే పోలీసులు,స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వలిగొండ మండల పరిధిలోని గొల్నెపల్లి గ్రామంలో గాదే ప్రవల్లిక (20) అనే యువతి అమ్మమ్మ తాతయ్య సింగపాక యాదమ్మ మల్లయ్య దగ్గర ఉంటు హైదారాబాద్ లో నీ హయత్ నగర్ లోని ఒక ప్రైవేటు కళాశాలలో నర్సింగ్ చదువుతున్న,యువతిని ఇతర (కుటుంబ) కారణాల వల్ల ఇతరులు మందలించడంతో మనస్తాపానికి లోనైన ప్రవల్లిక గురువారం బీబీనగర్ మండల పరిదిలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని మృతురాలి బంధువులకు అప్పగించి దర్యాప్తు చేస్తున్నట్లు,రైల్వే పోలీస్ అధికారులు కృష్ణారావు తెలిపారు.దీంతో ఇతర కారణాలతో ప్రవళికను మందలించి,ప్రవళిక మృతికి కారణమైన వారి ఇంటి ముందు మృతదేహంతో శుక్రవారం సాయంత్రం మృతురాలి బందువులు,ప్రవళిక మృతికి కారకులైన వ్యక్తులను చట్ట ప్రకారం శిక్షించి,మృతురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ,బందువులు ఆందోళన చేపట్టడంతో.సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై యుగంధర్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులతో మాట్లాడి,చట్ట ప్రకారం చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

