అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి

అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
వలిగొండ జూన్ 25 ప్రజాకలం:ఎలాంటి అనుమతి లేని శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్ యుఐ నియోజకవర్గ అధ్యక్షుడు బొల్లేపల్లి వినయ్ కుమార్ అన్నారు.మంగళవారం శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని పాఠశాల ముందు జండాలతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వలిగొండ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ కి ఎలాంటి అనుమతి లేవని, దీనిని విద్యార్ధుల తల్లిదండ్రుకు గమనించాలన్నారు.అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి,మండల విద్యాశాఖ అధికాతులను కలిసి అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యుఐ మండల అధ్యక్షులు శ్యామల సాయికుమార్,నారగొని మురళి,సోషల్ మీడియా కోఆర్డినేటర్ చేగురి ప్రసాద్, బత్తిని మధు,కూర శ్రీరామ్, పబ్బు కార్తీక్,తదితరులు పాల్గొన్నారు

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )