ఘనంగా అక్షర కౌముది సంస్థ 6 వ వార్షికోత్సవం.

ఘనంగా అక్షర కౌముది సంస్థ 6 వ వార్షికోత్సవం.

ఘనంగా అక్షర కౌముది సంస్థ 6 వ వార్షికోత్సవం.

హైదరాబాద్, మార్చి 16,  ప్రజా కలం ప్రతినిధి :

సమాజ వికాసానికి సాహిత్యం సంస్కృతి రెండు కళ్ళు లాంటివని ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వాధ్యక్షులు డా ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు.డాక్టర్ ఏ ఎస్ రావ్ నగర్ వాసుల సంక్షేమ & సాంస్కృతిక సంఘం వారి గ్రంథాలయ భవనం మొదటి అంతస్తు లో అక్షర కౌముది సంస్థ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసి నేటి సమాజంలో నైతిక విలువలు ను కాపాడుతూ స్వచ్ఛంద సంస్థగా అక్షర కౌముది సంస్థ పలురకాల సేవలు చేయడం హర్షణీయం అని వారు చెప్పారు.సమాజంలో సామాజిక సాంస్కృతిక సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తించి వారికి పురస్కారాలు అందించడం ఆనందదాయకం,గత ఆరు సంవత్సరాలుగా అక్షర కౌముది పాఠశాల విద్యార్థుల కు వివిధ రకాల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన బహుమతులు అందజేస్తూ వారిని ప్రోత్సహించడం అభినందనీయం అన్నారు.సంస్థ అధ్యక్షురాలు తులసి విజయ లక్ష్మీ మాట్లాడుతూ సంస్థ పక్షాన సాహిత్య కార్యక్రమాలు కవి సమ్మేళనం నిర్వహిస్తూ యువ కవులను ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు నిర్తహిస్తున్నాము,ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 40 మందికి,భావనాలయ నృత్య అకాడమీ విద్యార్థులకు 20 మందికి బహుమతుల ప్రదానోత్సవం చేశామని చెప్పారు.
ఈకార్యక్రమంలో విశిష్ఠ అతిథిగా డా ఏనుగు నరసింహ రెడ్డి ఐఏఎస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వాధ్యక్షులు డా ఆచార్య మసన చెన్నప్ప, పాల్గొన్నారు.తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షులు బడే సాబ్, పాల్గొన్నారు.ఈసదర్భంగా జనశ్రీ కుడికాల జనార్ధన్ మూడు పుస్తకాల ఆవిష్కరణ అంకితోత్సవం జరిగింది.ఈకార్యక్రమంలో సంస్థ పక్షాన సినారె సాహిత్య పురస్కారం డా ఏనుగు నరసింహ రెడ్డి కి తులసి పురస్కారం ఆచార్య డా మసన చెన్నప్ప కు,తాళ్లూరి పురస్కారం సాధు వాస్వాని ఇంటర్నేషనల్ స్కూల్ కు ,గురు సౌభాగ్య పురస్కారం పాలమూరు మహిళా సంస్థ వారికి ఉత్తమ సంస్థ గా జానపద గాయని రేలా రే రేలా పాటల విజేత కోమారి రోజా రమణి కి మాణిక్యం పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్షర కౌముది సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డా తులసి వెంకట రమణా చార్యులు, ప్రధాన కార్యదర్శి మూర్తి శ్రీదేవి,కోశాధికారి బచ్చల మాధవి,సభ్యులు తాళ్లూరి వెంకట కృష్ణ,ముదిగొండ సంతోష్ కుమార్ శర్మ, పోచం సుజాత,గూటూరి సత్యనారాయణ,రామ చంద్రుడు,కవులు, రచయితలు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )