
తనిఖీలు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారిపై దాడికి యత్నం
తనిఖీలు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారిపై దాడికి యత్నం
* ఫుడ్ సేఫ్టీ అధికారులను అడ్డుకొని అసభ్య పదజాలంతో దూషించిన కిరాణం షాప్ యజమాని…
– అధికారుల పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
వలిగొండ జనవరి 27 (ప్రజాకలం ప్రతినిధి):వలిగొండ మండల కేంద్రంలోని కిరాణా షాపులను,హెూటల్స్ ను యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జి ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ శివ శంకర్ రెడ్డి తనిఖీలు చేస్తున్న సమయంలో కిరణ్ షాప్ యజమాని దాడి చేసిన ఘటన వలిగొండ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.తమ విధి నిర్వహణలో భాగంగా మండల కేంద్రంలోని మాతాజీ కిరాణం షాపు తనిఖీ చేసిన అనంతరం మణికంఠ కిరాణాల షాపులోని ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి షాపులోకి వెళుతుండగా,షాపు యజమాని నాగభూషణం, అతని భార్య లలిత,కొడుకు మణికంఠలు ముగ్గురు కలిసి దుర్భాషలాడుతూ,అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ, అధికారుల పట్ల ప్రవర్తిస్తూ తనిఖీని అడ్డుకున్నారని,ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా పై అధికారుల సూచన మేరకు పోలీసుల సహకారంతో షాపులో తనిఖీలు నిర్వహించామని,లేబుళ్లు లేకుండా,గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలతో పాటు అధిక మొత్తంలో రంగులు,రసాయనాలు వాడినట్లుగా గుర్తించి శాంపిల్ సేకరించిన్నట్లు తెలిపారు. తనిఖీలు చేసిన సమయంలో మొబైల్ ఫోన్ లాక్కుని ధ్వంసం చేసే ప్రయత్నంతో పాటు ముకుమ్మడిగా దాడికి ప్రయత్నించినట్లు తెలిపారు.ఫుడ్ సేఫ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు యుగంధర్ గౌడ్ తెలిపారు.

