
అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి, జనవరి 22 (ప్రజాకలం) :అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్ సూచించారు.గురువారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ మెట్ పల్లి పట్టణంలోని కళానగర్ ఎస్సారెస్పీ కెనాల్ పక్కన గల దోబీఘాట్ సమీపంలో ఫిల్టర్ బెడ్ వద్ద ఈ నెల 20న ఉదయం పదిన్నర గంటల సమయంలో పట్టణానికి చెందిన వన్నెల గంగు, ఆమె కుమారుడు వన్నెల రవికుమార్ లపై ఇద్దరు గుర్తు తెలియని మగ వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచి, గంగు మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. సిసి కెమెరాల ఆధారంగా సేకరించిన నిందితులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను విడుదల చేశారు. ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించడంలో ప్రజలు పోలీసులకు సహకరించవలసిందిగా కోరారు. ఫోటోలలోని వ్యక్తుల గురించి గానీ, వారి కదలికల గురించి గానీ ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి నగదు బహుమతి అందజేయబడుతుందన్నారు. అంతేకాకుండా సమాచారం అందించిన వ్యక్తుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, వారికి పోలీస్ ఉన్నతాధికారుల నుండి ప్రత్యేక ప్రశంసా పత్రాలు కూడా అందజేస్తామన్నారు. ఇదిలావుండగా మహిళలు ఒంటరిగా ప్రయాణించేటప్పుడు తమ బంగారు ఆభరణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని వెల్లడించారు. సిఐ మెట్ పల్లి 8712656819 కానీ ఎస్సై మెట్ పల్లి 8712656794 మెట్ పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నంబర్లను సంప్రదించాలని వి. అనిల్ కుమార్ పేర్కొన్నారు.
.

