
బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ తీర్మానాన్ని స్వాగతిస్తున్నాo
బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ తీర్మానాన్ని స్వాగతిస్తున్నాo
– రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించిన సిఎంకు,పిసిసి ఛీఫ్,మంత్రులకు ధన్యవాదాలు*
– బీసీ రిజర్వేషన్లను ఎవరు అడ్డుకోవాలని చూసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు*
-క్యాబినెట్ తీర్మానం ముమ్మాటికి ఇది బీసీల పోరాట విజయమే*
*=బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్ల కొండ వేణుగోపాల్ గౌడ్*
హనుమకొండ జులై 12 ప్రజా కలం ప్రతినిధి
ఇటీవల రాష్ట్ర సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని, 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు.
క్యాబినేట్ నిర్ణయానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకాటి శ్రీహరి, ఇతర క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు
హన్మకొండ బాలసముద్రం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంఘాల నేతలతో కలిసి వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచాలని గత 18 నెలలుగా అనేక రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని గల్లీ నుండి ఢిల్లీ వరకు నిర్వహించిన పోరాట ఫలితమే ఈ 42 శాతం రిజర్వేషన్ల ప్రకటన, ఇది ముమ్మాటికి బీసీల విజయంగా భావిస్తున్నామన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం మొదటగా తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగనన చేపట్టాలని, ఆ తర్వాత బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశామని తమ డిమాండ్ ను గౌరవించి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన బిల్లును రాష్ట్ర గవర్నర్ ద్వారా గత ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రపతికి పంపించడం జరిగిందని, రాష్ట్రం ప్రభుత్వం పంపించిన బిల్లు ఈరోజు జూలై 11 నాటికి మూడు నెలలు పూర్తయిందని అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో కనీసం స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
ఒకవైపు సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు ముగించాలని కోర్టు తీర్పులు ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బీసీ బిల్లును కనీసం పరిగణలోకి తీసుకోకపోవడంతో ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం తనకున్నటువంటి సర్వ అధికారాలు ఉపయోగించి గత ప్రభుత్వం చేసిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ప్రత్యేక పరిస్థితుల దృశ్య బీసీ రిజర్వేషన్ల 42 శాతం పెంచడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చి గవర్నర్ ద్వారా ఆమోదించుకొని బీసీ రిజర్వేషన్లు కచ్చితంగా 42 శాతం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ఇలాంటి సమయంలో రాజకీయ పార్టీలు బీసీల రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని బీసీ రిజర్వేషన్లను రాజకీయంగా బలిపీఠం ఎక్కించకుండా బీసీ రిజర్వేషన్ల పెంపుకు అన్ని పార్టీలు సహకరించాలని వేణుగోపాల్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్లను ఆట కేక్కించాలని చూస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని న్యాయస్థానాలను అడ్డుపెట్టుకొని కొంతమంది కోవర్టుల ద్వారా లేనిపోని న్యాయపరమైన చికాకులు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే కచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు
బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అగ్రకుల సమాజం సంపూర్ణంగా మద్దతు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని, గత ప్రభుత్వంలో బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడానికి కోర్టులను వేదికలుగా చేసుకొని అగ్రకులాలు 34% అమలు కాకుండా అడ్డుకున్నారని ఇప్పుడు కూడా అదే వైఖరితో వ్యవహరిస్తే బీసీలు కూడా అగ్రవర్ణాలకు కల్పిస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయించాలని రోడ్లపైకి రావలసి వస్తుందని రద్దు చేసే వరకు కచ్చితంగా సమరశీలమైన పోరాటాలు చేయాల్సి వస్తుందని ఆయన సున్నితంగా హెచ్చరించారు
ఈ మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాడి మల్లయ్య యాదవ్, బీసీ విద్యావంతుల వేదిక జిల్లా కన్వీనర్ డా. చిర్ర రాజు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కాసగాని అశోక్, పెరుమాండ్ల అనిల్ గౌడ్, పంజల మధు, తెల్ల కిషోర్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు మాదం పద్మజ దేవి, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మేలా శోభరాణి, బీసీ మహిళా జిల్లా నాయకురాలు, తెల్ల సుగుణ, మౌనిక తదితరులు పాల్గొన్నారు

