
తెలంగాణ సంస్కృతి ప్రతీక బోనాలు: విజయశాంతి
తెలంగాణ సంస్కృతి ప్రతీక బోనాలు – ప్రజలతో కలిసి ప్రభుత్వం జరుపుతోంది: ఎమ్మెల్సీ విజయశాంతి
మూసాపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బోనాల సందర్భంగా చెక్కుల పంపిణీ
హైదరాబాద్, జూలై 10 (ప్రజా కలం):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ముఖ్య పండుగ బోనాలని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఘనంగా నిర్వహిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, సినీ నటి శ్రీమతి విజయశాంతి గారు అన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని మూసాపేటలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ గారి సమక్షంలో ఆలయాల్లో బోనాల సందర్భంగా అవసరమైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం విడుదల చేసిన చెక్కులను ఆలయ కమిటీలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రమేష్ గారు మాట్లాడుతూ, “తెలంగాణలో బోనాలు తొలిపండుగ. ఇది ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి నిదర్శనం. ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోంది. ప్రజల సహకారంతో ఈ పండుగను విశేషంగా నిర్వహించాలనే లక్ష్యంతో మేము ముందుకు సాగుతున్నాం,” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, బ్లాక్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్లు, డివిజన్ నాయకత్వ బృందాలు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మైనారిటీ, ఎస్సీ, బీసీ సెల్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
బోనాల పండుగను పురస్కరించుకుని ప్రజలకు మరింత సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నాయకులు తెలిపారు.

