అసమ్మతి రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గుజ్జుల

అసమ్మతి రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గుజ్జుల

అసమ్మతి రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గుజ్జుల
గుజ్జులపై తీవ్ర ఆరోపణలు చేసిన దుగ్యాల వర్గం
పెద్దపల్లి బీజేపీలో ముదిరిన వార్
పెద్దపల్లి,జులై 07:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
పెద్దపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ లో అంతర్గత పోరు తీవ్రమైంది.పార్టీ నియమాలకు విరుద్ధంగా తప్పుడు ఆరోపణలతో మీడియా సమావేశాలు నిర్వహించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే,బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గం నాయకుల ప్రకటనలను దుగ్యాల ప్రదీప్ కుమార్ వర్గీయులు తీవ్రంగా ఖండించారు.గుజ్జుల రామకృష్ణారెడ్డి తమ వ్యక్తిగత రాజకీయాల కోసం పార్టీని తాకట్టు పెట్టారని,తమను విమర్శించే నైతిక హక్కు ఆయనకు లేదని వారు ఆరోపించారు. సోమవారం స్థానిక జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు,దుగ్యాల వర్గీయులు మాట్లాడుతూ గుజ్జుల రామకృష్ణారెడ్డిని వర్గపోరుకు,అసమ్మతి రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ గా అభివర్ణించారు.గత 30 ఏళ్లుగా ఆయన పార్టీని తన వ్యక్తిగత సంస్థగా నడుపుతూ అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి,పార్టీపై,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ పైన తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా,కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం బాధాకరమని,ఖండనీయమని అన్నారు.ఒకప్పుడు కేంద్ర మంత్రి సీహెచ్. విద్యాసాగర్ రావును,ఆ తర్వాత బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడ్డారని,ఇప్పుడు అదే కుట్రతో పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు.ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారీ డిపాజిట్ కోల్పోయిన గుజ్జుల రామకృష్ణారెడ్డి,తన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థుల గెలుపు కోసం కుమ్మక్కై పెద్దపల్లిలో బీజేపీ పతనానికి కారణమయ్యారని బీజేపీ నాయకులు ఆరోపించారు.ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు అద్దె ఇంట్లో ఉన్న ఆయన,ఎమ్మెల్యే అయ్యాక పెద్ద పెద్ద భవనాలు, భారీగా ఆస్తులు ఎలా కూడబెట్టారని ప్రశ్నించారు.ఆయన చేసిన వ్యాపారాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గీయుల బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌లు,పెద్దపల్లి వ్యాపారులను వేధించడం వంటి చర్యల వల్ల పార్టీ పరువు దెబ్బతిన్నదనే విషయం పెద్దపల్లి ప్రజలందరికీ,కార్యకర్తలకు తెలిసిందేనని అన్నారు.గుజ్జుల వర్గం నాయకులుగా చెప్పుకుంటూ నిన్న ప్రెస్ మీట్‌లో మాట్లాడిన నేతలు,ఆయన పేరు చెప్పి పెద్దపల్లి పట్టణంలో చేస్తున్న బ్లాక్‌మెయిల్‌లు,అక్రమ వసూళ్ల దందాను త్వరలో ఆధారాలతో సహా బయట పెడతామని హెచ్చరించారు.బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడే గుజ్జుల రామకృష్ణారెడ్డి,ఆయన అనుచరులు పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేస్తున్న తమను విమర్శించడం హాస్యాస్పదమన్నారు.పార్టీని కూడా తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నోసార్లు బ్లాక్‌మెయిల్ చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కరీంనగర్‌లో ఆయన కట్టుకున్న ఇంటి నిర్మాణానికి ఇటుకలు, కంకరలు తరలించేందుకు క్రషర్ యజమానులను బెదిరించిన గుజ్జుల రామకృష్ణారెడ్డి,పార్టీ కోసం 30 ఏళ్లుగా పూర్తి సమయ కార్యకర్తగా,నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి తన జీవితాన్ని త్యాగం చేసిన దుగ్యాల ప్రదీప్ కుమార్‌ను విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.బీజేపీని ప్రైవేట్ పార్టీ లాగా పెద్దపల్లిలో నడుపుతున్న గుజ్జుల కబంధ హస్తాల నుండీ విడిపించి కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీని నడుపుతున్నాడని, తమ ఆదాయ మార్గాలు మూసుకుపోతున్నాయనే అక్కసుతోనే గుజ్జుల అనుచరులు దుగ్యాల ప్రదీప్ పై అవాకులు చెవాకులు పేలుతున్నారని పేర్కొన్నారు.పార్టీ క్రమశిక్షణకు తూట్లు పొడిచేలా వర్గపోరుతో పెద్దపల్లిలో బీజేపీ పతనానికి కారణమవుతున్న గుజ్జుల మరియు ఆయన అనుచరుల కార్యకలాపాలను రాష్ట్ర నాయకత్వం వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.పార్టీకి నిజమైన అంకితభావంతో సేవ చేస్తున్న తాము,ఇటువంటి అవినీతిపరులు,పార్టీ శత్రువుల విమర్శలకు భయపడేది లేదని,ప్రజల మద్దతుతో,పార్టీ నియమ నిబంధనలతో ముందుకు సాగుతామని తెలియజేశారు.ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు శిలారపు పర్వతాలు,పట్టణ మండల అధ్యక్షులు రాకేష్,వేల్పుల రమేష్,కారంగుల శ్రీనివాస్,చిలువెరు సంపత్,కావేటి రాజగోపాల్,మేకల శ్రీనివాస్,చిలుక తిరుపతి,తంగెడ రాజేశ్వరరావు,ఈర్ల శంకర్,సంపత్ రావు,శ్రీకాంత్,కిరణ్,గుడ్ల సతీష్,ఒల్లే తిరుపతి,తీర్థాల కుమార్, మెరుగు సరంగం,తోట శ్రీధర్,బోడ్డుపల్లి కుమార్,ముంజ రాజేంద్రప్రసాద్,సబ్బు మల్లయ్యతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )