
యువకుడు దారుణ హత్య…
యువకుడు దారుణ హత్య…
– భార్య, అత్త చేతిలోనే హతం..
మల్లాపూర్ నవంబర్ 17 ( ప్రజా కలం ప్రతినిధి)
మల్లాపూర్ మండలంలో కొత్త ధాం రాజ్ పల్లి గ్రామం లో భార్య ,అత్త చేతిలో యువకుడు దారుణ హత్య కు గురైన హృదయ విదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై కొసన రాజు తెలిపిన వివరాల ప్రకారం మెట్ పల్లి అర్బన్ కాలనీకి చెందిన మందపల్లి భూమేష్ ను (31) అతని భార్య మంధపెల్లి విజయ (32) మరియు ఆమె తల్లి కోగురి లక్ష్మి (50) తో కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
భూమేష్‌కు ఇది మొదటి వివాహం కాగా, విజయకు రెండవ వివాహం కావడం గమనార్హం. వివాహానంతరం కొంతకాలం మెట్‌పల్లిలో నివసించిన దంపతులు, గత సంవత్సరం నుండి కొత్త ధాం రాజ్ పల్లి ఇందిరమ్మ కాలనీలో అద్దె ఇంటిలో ఉంటున్నారు.
భూమేష్ మెట్‌పల్లి పట్టణంలోని షేక్ అజీం దగ్గర పనిచేసేవాడు. అయితే ఆయన సంపాదించిన డబ్బులను తరచూ ఇంటికివ్వకపోవడం, భార్యను నిర్లక్ష్యం చేయడం, గొడవలు పెరగడం వంటి కారణాలతో విజయ, తన తల్లి లక్ష్మితో కలిసి అతన్ని హత్య చేయాలని భావించారు.ఆదివారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో భూమేష్ గొంతుకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు దర్యాప్తులో తెలిసింది. అనంతరం తమ నేరాన్ని దాచేందుకు, భూమేష్ సహజ మరణం జరిగినట్లు చూపించేందుకు, మృతదేహాన్ని ఇంటి బయట వాకిట్లో బోర్లా పడుకోబెట్టారు.
ఈ ఘటనపై మృతుడి మేనల్లుడు చిన్నబోయిన నాగరాజు ఫిర్యాదు చేయడంతో మల్లాపూర్ ఎస్సై కేసు నమోదు చేశారు. తదనంతరం మెట్‌పల్లి సీఐ దర్యాప్తు చేపట్టి, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

