మెట్ పల్లి క్లబ్ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి

మెట్ పల్లి క్లబ్ అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి

– సబ్ రిజిస్టర్ కు వినతి పత్రం సమర్పించిన శాశ్వత సభ్యుల వారసులు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జులై 28(ప్రజా కలం) మెట్ పల్లి క్లబ్ ను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినారని రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సబ్ రిజిస్టర్ కు శాశ్వత సభ్యుల వారసులు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మెట్ పల్లి క్లబ్ బాడీ మెంబర్స్ మేమే అంటూ చలామణి అవుతూ కొందరు చేసిన నిర్వాకానికి సోమవారం శాశ్వత సభ్యుల వారసులందరూ కలిసికట్టుగా సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి మెట్ పల్లి క్లబ్ బైలాస్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ క్లబ్ బాడీ మెంబర్స్ మేమే అంటూ శాశ్వత సభ్యులకు మరియు చనిపోయిన వారసులకు ఎలాంటి సమాచారం తెలియజేయకుండా అనుమతులు తీసుకోకుండా పేపరు ప్రకటన ఇవ్వకుండా అందులోని కొంతమంది బాడీ మెంబర్స్ గా ఏర్పడి తమ స్వార్థం కొరకు సిండికేట్ గా ఏర్పడి మెట్ పల్లి నడిబొడ్డున కలిగి ఉన్న అత్యంత ఖరీదైన భూమిని కేవలం వారి స్వార్థం కొరకు తక్కువ రేటుకు అట్టి భూమిని విక్రయించి సొమ్ము చేసుకుందాం, అని ప్రయత్నించి అతి తక్కువ రేటుకు విక్రయించడం జరిగింది.బైలా ప్రకారం ఏదైనా క్లబ్ అమ్మి వేయాలి అనుకున్నప్పుడు పూర్తి సభ్యుల అంగీకారం తోనే అట్టి క్లబ్ ని ఇంకో వేరే అనుసంధానమైన క్లబ్బులకే విక్రయించాలి అలా కాకుండా సొంత నిర్ణయాలు తీసుకొని నియమ నిబంధనలు వ్యతిరేకించి ఇట్టి రిజిస్ట్రేషన్ చేసినందుకు వారిని కఠినంగా శిక్షించి అట్టి రిజిస్ట్రేషన్ ని క్యాన్సల్ చేసి అట్టి రిజిస్ట్రేషన్ పై పూర్తిస్థాయి విచారణ చేయించి రిజిస్ట్రేషన్ రద్దు చేసి మళ్లీ మెట్ పల్లి క్లబ్ పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో చనిపోయిన శాశ్వత సభ్యుల వారసులందరూ పాల్గొనడం జరిగింది

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )