నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలు.

నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలు.

నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలు
మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్


మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఆగస్టు 23 (ప్రజా కలం)నేరాల నియంత్రణకు ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మెట్ పల్లి ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. నేరాల నియంత్రణకు పట్టణంలోని పలు కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటును ఆయన పరిశీలించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వ్యాపార సంస్థలకు, ఇళ్లకు కూడా సీసీ కెమెరాలు బిగించుకోవడం ద్వారా నేరాలు జరిగినప్పుడు త్వరితగతిన నేరస్తులను పట్టుకునే వీలు ఉంటుందన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరస్తుడు కూడా నేరం చేసేందుకు జంకుతారని ఆయన పేర్కొన్నారు. పట్టణంలోని ముఖ్య కూడలలో వ్యాపారులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని ఎస్ఐ కిరణ్ కుమార్ సూచించారు. డిపార్ట్మెంట్ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా అవగాహన కల్పిస్తుందని వివరించారు. పట్టణంలో ముఖ్య కూడలను గుర్తిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా వ్యాపార, వాణిజ్య సంస్థల తోడ్పాటు తీసుకుంటామని అన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )