పేకాట స్థావరల పై సీసీఎస్ పోలీసుల దాడి

– -పోలీసుల అదుపులో 17 మంది, 29370/- నగదు,12 మొబైల్స్ స్వాధీనం
జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఆదేశాలతో అక్రమ కార్యక్రమాలపై పటిష్ఠ నిఘా …
– – పేకాట ఆడిన, నిర్వహణ స్థావరాలు ఏర్పాటు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి అక్టోబర్ 28 (ప్రజా కలం) కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని అష్ట లక్ష్మి ఆలయ సమీపంలో పేకాట ఆడుతున్నారు అన్న సమాచారం మేరకు పేకాట స్థావరం పై సీసీఎస్ పోలీసులు దాడి చేసి 10 మందిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి 22,050 నగదు,5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.అనంతరం వారిని విచారణ నిమిత్తం కోరుట్ల పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వకోట గ్రామ శివారులో పేకాట స్థావరం పై దాడి చేసి 7 గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 7320 నగదు,7 మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఈ సందర్భంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో అక్రమ,అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పటిష్టం చేసి, పక్క సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్ల తెలిపారు. పేకాట ఆడిన, నిర్వహణ స్థావరాలు ఏర్పాటు చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )