
ఎమ్మెల్యే సబితమ్మ చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్
ఎమ్మెల్యే సబితమ్మ చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్
ఎల్గనీ హనుమంత్ గౌడ్, నోముల రవి కి, సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన
బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్గనీ ప్రవీణ్ గౌడ్
మహేశ్వరం, జనవరి 29,(ప్రజా కలం)
ఎమ్మెల్యే సబితమ్మ చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగిందని బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్గనీ ప్రవీణ్ గౌడ్ అన్నారు.మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలం గొల్లూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం తీసుకున్న ఎల్గనీ హనుమంత్ గౌడ్, నోముల రవి కి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, గురువారం అందచేశారు, ఈసందర్భంగా ప్రవీణగౌడ్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సబితమ్మ చొరవ మరువలేనిది అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల వైస్ ప్రెసిడెంట్ మంద మహేష్, sc సెల్ ప్రెసిడెంట్ నందుపల్లి కుమార్, నాయకులు నర్సింహ, మల్లేష్, సతీష్, భీమరాజ్, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

