
రాధిక రమేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి
రాధిక రమేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తానే అభివృద్ధి సాధ్యం
అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి
పోచంపల్లి మున్సిపాలిటీ 13 వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 07,(ప్రజా కలం)
రాధిక రమేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి 13వ వార్డు ఓటర్లను కోరారు. పోచంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాడు పోచంపల్లి 13వ వార్డు ఎన్నికల ప్రచారంలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సురపల్లి రాధిక రమేష్ ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని రాధిక రమేష్ గెలిస్తే వార్డు అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తన అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని మరింత అభివృద్ధి జరగాలన్న ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అందుకే పోచంపల్లి లో ఉన్న అన్ని మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని గెలిపించాలని యాదాద్రి జిల్లాలోని ఆదర్శవంతమైన పోచపల్లి మున్సిపాలిటీ తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని అందుకోసమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అందరిని గెలిపించాలని ఎమ్మెల్యే కుమార్ అనిల్ కుమార్ రెడ్డి ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో తడక వెంకటేశం, భారత లవ కుమారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

