కాంగ్రెస్ లో కష్టపడ్డ వారికి గుర్తింపు లేదు….

కాంగ్రెస్ లో కష్టపడ్డ వారికి గుర్తింపు లేదు….

కాంగ్రెస్ లో కష్టపడ్డ వారికి గుర్తింపు లేదు….
కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా
పార్టీకి పనిచేయని వారికి కాంగ్రెస్ టికెట్లు
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి ఫిబ్రవరి 3 (ప్రజాకలం) : కష్టపడ్డ వారికి గుర్తింపు లేదని. పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్లు ఇవ్వడంతో నిరూపితం అయ్యిందని కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కి గత ముప్పై సంవత్సరాలుగా సేవ చేస్తున్నానని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తే పార్టీ కి ఎలాంటి సేవ చేయని వారికి టికెట్ ఇచ్చారన్నారు. పార్టీ కార్యకర్తగా, పార్టీ పట్టణ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ఉనికి కాపాడుతూ. గత 10 సంవత్సరాల బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో ప్రతి పక్ష హోదాలో ఉండి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు చేశానని తెలిపారు. ఎన్నోసార్లు అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచారని పార్టీ కోసం కేసులు కూడా నమోదు అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్ట పడిన తనను కాదని పార్టీకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని తీసుకువచ్చి తన స్తానంలో పార్టీ బీ ఫామ్ ఇవ్వడం అన్యాయం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ లో ఉండి గతంలో పార్టీ అభ్యర్థుల పై రెబల్ గా పోటీ చేయడమే కాకుండా, ఇతర పార్టీ వ్యక్తికి మద్దతు తెలిపాడని ఆరోపించారు.పార్టీ తన కష్టాన్ని, పార్టీకి చేసిన సేవను గుర్తించపోయిన తాను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఎన్నికల నుండి తప్పుకుంటున్నానని పాషా తెలిపాడు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )