రైతు భరోసా సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు

రైతు భరోసా సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు

… ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం..
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 26 (ప్రజా కలం)రైతు భరోసా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి,ముఖ్యమంత్రి రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ గురువారం మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,కోరుట్ల నియోజకవర్గ టీపీసీసీ డెలిగేట్ సుజిత్ రావు ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి,టపాసులు కాల్చి,స్వీట్లు తినిపించుకొని కాంగ్రెస్ నాయకులు రైతుభరోసా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశంలో రైతుల కోసం ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అని.వ్యవసాయం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే వ్యవసాయం.ఇది చరిత్ర పుటల్లో చిరస్థాయిగా మిగిలిపోతాయి  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 21,000 కోట్ల రైతు రుణమాఫీ 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా రూపంలో జమ భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 చొప్పున నేరుగా ఖాతాల్లోకి ఇది ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమే చేయగలిగిందని అన్నారు. రైతుల పండుగకు కారణమైన మా ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి రైతును రాజు చేయడమే మా లక్ష్యం అని కాంగ్రెస్ నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్,తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ సేల్ జాయింట్ కోఆర్డినేటర్ వాకిటి సత్యం రెడ్డి,మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబోదీన్ పాషా,టీపీసీసీ ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుత్త నారాయణ,మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి,ఇబ్రహీంపట్నం మండల యూత్ కాంగ్రెస్ నల్లూరి సాగర్, మాజీ ఎంపిటిసి,కోరుట్ల మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుంటాల వికాస్,మాజీ సర్పంచ్ బుడత సుదర్శన్,మాజీ ఎంపిటిసి సింగరపు అశోక్,కాంగ్రెస్ నాయకులు కల్లెడ గంగాధర్,యండి జాఫర్,మామిడి రాజశేఖర్ రెడ్డి,ఇప్పపెల్లి గణేష్ మొగలి రాజేందర్,తోగిటి నాగరాజు ఎట్టెం మల్లేశ్,పిట్టల వెంకటేష్,శ్రీనివాస్,రెండ్ల వెంకటేష్,కనుక దినేశ్ కిసాన్ సేల్ కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )