గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం
*రుద్రంగి, జూలై 03, (ప్రజాకలం ప్రతినిధి)*
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కుళ్ళిపోయిన ఓ గుర్తు తెలియని మృతదేహం కనబడినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక పల్లె ప్రకృతి వనం సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం చెట్టుకు ఉరేసుకుని కనిపించిందని, మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో లభ్యం అయిందని, ఇట్టి విషయం గొర్ల కాపరులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )