దోమల నివారణకు చర్యలు చేసుకోండి జెడ్ సి కి వినతి*

దోమల నివారణకు చర్యలు చేసుకోండి జెడ్ సి కి వినతి*

*దోమల నివారణకు చర్యలు చేసుకోండి జెడ్ సి కి వినతి*

*మల్కాజిగిరి,మార్చి10, (ప్రజా కలం ప్రతినిధి)*

మల్కాజిగిరి ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని తాళ్లబస్తీ,బిజెఆర్ నగర్, సత్తిరెడ్డి కాలనీ,పివిఎన్ కాలనీ,సత్య రాఘవేంద్ర కాలనీ,వెంకటేశ్వర కాలనీలలో దోమలు అధికంగా ఉన్నాయని దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి కార్పొరేషన్ జోనల్ కమిషనర్ ను కలసి బిఆర్ఎస్ నాయకులు ఎ కె మురుగేష్ ఆధ్వర్యంలో మెమొరండాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు నెలలుగా కాలనీలలో దోమల నివారణకు అధికారులు చర్యలు తీసుకోలేదని దీనితో కాలనీలో దోమలు విపరీతంగా ఉన్నాయని ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. వెంటనే దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరామని చెప్పారు.ఈ సమస్యతోపాటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్తును అందజేస్తామని చెప్పారని ఆ విషయంలో కూడా కాలనీవాసులకు పథకాన్ని అందే విధంగా చర్యలు తీసుకోవాలని మెమోరడంలో పేర్కొన్నట్లు తెలిపారు.దీనికి జెడ్ సి సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరించేందుకు విధంగా అధికారులకు సూచిస్తానని పేర్కొన్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సంధి గారి నర్సింగరావు,లక్ష్మీ ఆనంద్, వై ఉమాపతి ఇప్పల వెంకటేష్,వై సంతోష్, బాబురావు,తలబస్తి వెంకటేష్,మురళి నాయుడు,రాజేష్, తిరుపతి,అయూబ్,ఆర్ స్వామి,డప్పు సాయి,దాసు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )