ప్రతి విద్యార్థి కన్నతల్లి తండ్రుల కలను సాకారం చేయాలి

ప్రతి విద్యార్థి కన్నతల్లి తండ్రుల కలను సాకారం చేయాలి

ప్రతి విద్యార్థి కన్నతల్లి తండ్రుల కలను సాకారం చేయాలి
– యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
– సీనియర్ సివిల్ జడ్జ్ నాగేశ్వరరావు

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 26 (ప్రజా కలం) ప్రతి విద్యార్థి కన్న తల్లిదండ్రుల కలను సాకారం చేస్తూ ముందుకు వెళ్లాలని ప్రతి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ దుర్వినియోగ దినోత్సవం సందర్భంగా మెట్ పల్లి పట్టణంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వరరావు మాట్లాడుతూ మత్తు పదార్థాలతో చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను దుర్భరం చేసుకోవద్దన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కలలను సహకారం చేసేందుకు ఉన్నత చదువులు అభ్యసించాలన్నారు. మెట్ పల్లి డిఎస్పి రాములు మాట్లాడుతూ మత్తు పదార్థాలు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్నారు. సీఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ కన్న తల్లిదండ్రుల ఆశయాల కనుగుణంగా ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలన్నారు మత్తు పదార్థాలతో జీవితం అందకారమవుతుందన్నారు.అంతర్జాతీయ మాదకద్రవ్య దుర్వినియోగ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మనోహర్ గార్డెన్స్ పది విద్యార్థులకు మాదకద్రవ్య అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఎక్సైజ్ సిఐ వినోద్ కుమార్, యం ఈ ఓ మేకల చంద్రశేఖర్, బార్ అసోసియేషన్ చైర్మన్ కాంతి మోహన్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )