మెట్ పల్లిలో ఉత్సాహంగా సాగిన 2కే రన్

మెట్ పల్లిలో ఉత్సాహంగా సాగిన 2కే రన్

మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి, అక్టోబర్ 31 (ప్రజాకలం) : రాష్ట్రీయ ఎక్తా దివాస్ సందర్భంగా శుక్రవారం మెట్ పల్లి పోలీసులు పట్టణంలో రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుండి జాతీయ రహదారి మీదుగా బస్ డిపో చౌరస్తా వరకు 2కే రన్ నిర్వహించారు. రెండు కిలో మీటర్లు పట్టణంలోని యువకులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, సిబ్బంది ఉత్సాహంగా పరిగెత్తారు. ఈ సందర్బంగా మెట్ పల్లి డీఎస్పీ రాములు మాట్లాడుతూ… అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా ఏక్త దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇలాంటి కార్యక్రమం వల్ల దేశం మొత్తం ఒకటిగా, ఐక్యంగా ఉండాలని పిలుపునిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి సీఐ అనిల్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్, ఆల్ రౌండర్ గంగాధర్, మున్సిపల్ సిబ్బంది ముజీబ్, విద్యార్థులు, పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )