డ్రోన్ తో మక్కలు ఆరబెట్టిన రైతు..

డ్రోన్ తో మక్కలు ఆరబెట్టిన రైతు..

– నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో
మల్లాపూర్, అక్టోబర్ 24 (ప్రజా కలం ప్రతినిధి)
ఇటీవల రోజు కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు తను పండించిన మొక్కజొన్నలు సరిగా ఎండక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మల్లాపూర్ మండలం కొత్త ధాం రాజ్ పల్లి గ్రామానికి చెందిన పన్నాల నారాయణ రెడ్డి అనే రైతు వినూత్న పద్ధతిని అవలంబించారు. డ్రోన్ సహాయంతో మొక్కజొన్నలు ఎండబెట్టే కొత్త ప్రయత్నం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. మక్కాలు మైదానంలో పోసి డ్రోన్‌ను వినియోగించి మక్కల పై గాలి వీసే విధంగా ఏర్పాటు చేయడంతో వేగంగా ఎండిపోయి మ్యాచర్ తొందరగా వస్తుంది.
నారాయణ రెడ్డి చేసిన వినూత్న ఆలోచనను స్థానికులు, నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో విస్తృతంగా వైరల్ అవుతోంది. “పంట రక్షణలో రైతు సృజనాత్మకతకు ఇది అద్భుత ఉదాహరణ” అంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.”వర్షాలు ఎంత కురిసినా పంటను కాపాడటానికి మార్గాలు వెతకాలి” అని నారాయణ రెడ్డి అన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )