
ధర్మపురి పట్టణం లో పోలీసు వారి ఫ్లాగ్ మార్చ్
*ధర్మపురి పట్టణం లో పోలీసు వారి ఫ్లాగ్ మార్చ్*
–జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు
–డి ఎస్ పి డి రఘుచందర్, ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో
ఎండపల్లి, ధర్మపురి ఫిబ్రవరి 08 : ( ప్రజా కలం ప్రతినిధి )
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ లో నిర్వహిస్తున్న 2 వ సాధారణ మున్సిపల్ ఎన్నికల లో భాగంగా ధర్మపురి మున్సిపాలిటీ లో 11.02.2026 న జరిగే ఎన్నికల లో ఎలాంటి అవంచ నీయా సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించ డానికి ప్రజలందరూ సహకరించా లనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డి ఎస్పి డి రఘు చందర్ ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎలపాటి రామ్ నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో ధర్మపురి సర్కిల్ పోలీస్ సిబ్బంది తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా డీఎస్పీ రఘు చందర్ మాట్లాడుతూ ఎలక్షన్ల ను ప్రశాంతంగా నిర్వహించాలని ఎలాంటి గొడవలకు దారి తీయొద్దని, ప్రజలకు అభ్యర్థులకు తెలియజేశారు. పోలీసువారి ఆదేశాలను అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడు తాయని ఈ సందర్భంగా వివ రించారు. ఈ కార్యక్రమం లో ధర్మపురి ఎస్సైలు జి మహేష్, రవీందర్, వెల్గటూర్ ఎస్సై పులిచెర్ల ఉదయ్ కుమార్, బుగ్గారం ఎస్సై సతీష్, గొల్లపల్లి ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి, పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు ధర్మపురి ఎస్సై జి మహేష్ తెలిపారు.

